SRINIVASA KALYANAM HELD WITH GRANDEUR AT NARAYANAVANAM _ నారాయణవనంలో నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం
Tirupati, June 4, 2026: As part of the annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Narayanavanam, the celestial Srinivasa Kalyanam was performed with religious fervour on Thursday night.
The divine wedding of the Lord with Sridevi and Bhudevi was conducted as per Agama traditions amidst Vedic chanting and mangala vadyams. Devotees witnessed the sacred ceremony with devotion and received the blessings of the divine couple.
Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Srinivasulu Reddy, Temple Inspectors Sri Nagaraju and Sri Chengal Rayalu, and a large number of devotees participated.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నారాయణవనంలో నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం
శ్రీదేవి–భూదేవి సమేతంగా దివ్య మంగళ్యధారణ ఘట్టం
భక్తి పారవశ్యంలో పులకించిన భక్తజనం
తిరుపతి, 2026 జూన్ 04: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన శ్రీనివాస కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధల నడుమ జరిగింది.
రాత్రి 8.30 గంటలకు వేదపండితులు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్ఠాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ తదితర శాస్త్రోక్త క్రతువులతో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించారు.
నక్షత్రహారతి, మంగళహారతులతో ముగిసిన ఈ దివ్య కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి స్వామి, అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
