SRINIVASA KALYANAM MUSES DELHI DENIZENS _ దేశరాజధానిలో వెల్లివెరిసిన శ్రీవేంకటేశ కల్యాణ వైభవం

NEW DELHI, JUNE 1:The denizens of the nation’ s capital were captivated by the spiritual charm of the wedding ceremony of the processional deities that took place in Sri Venkateswara College Grounds located in Daulakhan area on Saturday evening.

The celestial wedding which began by 6.30pm with Punyahavachanam by the archakas of Tirumala in a grand way continued till 8.30pm for about two hours. The priests performed the Kalyanam of Lord Malayappa Swamy with his two Consorts Sridevi and Bhudevi in a colourful manner as per Hindu marriage tradition with Vishwaksena Aradhana, Ankurarpana, Raksha Bandhana, Agni Pratistha, New silk Vastrams, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana, Varana Mayiram and concluded with Nakshatra Harati and Mangala Harati.

Tens of thousands of people converged in the sprawling grounds of the college to witness the grandeur of the celestial wedding and chanted Govinda Nama with overwhelming excitement.

Speaking on this ceremonious occasion, TTD Trust Board Chairman Sri K Bapiraju said, TTD has been organising these Srinivasa Kalyanams from the past seven years in hamlets, towns, cities, metros of the countries as well in abroad with a noble aim to propagate the Sri Venkateswara Bhakti Cult as well to bestow peace and prosperity across the globe. 

TTD EO Sri LV Subramanyam said, it is indeed a great moment to perform the divine wedding in the country’s capital as people of all faiths had an opportunity to witness the celestial marriage ceremony. 

Actress turned politician and MP Smt Jayaprada, Cabinet Secretary Sri Satish Chandra, TTD JEOs Sri KS Sreenivasa Raju, Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar, EE Sri Jaganmohan Reddy, SV College Principal Smt Hemalatha Reddy, Chief Co-ordinator of the programme Sri Suryaprakash Rao, Dy EE Sri Prakash Babu, PRO Sri T Ravi and a huge gathering of devotees were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, (CAMP AT DELHI)

దేశరాజధానిలో వెల్లివెరిసిన శ్రీవేంకటేశ కల్యాణ వైభవం

తిరుపతి, జూన్‌ 01, 2013: భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ మహానగరంలో ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక దౌలాకాన్‌ ప్రాంతంలోని శ్రీవేంకటేశ్వర కళాశాల సువిశాల మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ”శ్రీనివాస కల్యాణానికి” విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ దైనిక వివాహ వైభవాని చూసి భక్తి పారవశ్యంతో పులకించారు.
 
సాయంత్రం 7.00 గం||లకు పుణ్యాహవచనంతో ప్రారంభమైన ఈ కల్యాణ మహోత్సవం సుమారు రెండు గంటల పాటు కొనసాగి మంగళ హారతితో వేడుకగా ముగిసింది. తితిదే అర్చక బృందం నేతృత్వంలో శ్రీవారి ఉత్సవరులైన శ్రీమలయప్ప స్వామి,శ్రీదేవి, భూదేవిలకు అత్యంత రమణీయంగా దివ్యమంత్రోఛరణల మధ్య వివాహమహోత్సవం జరిగింది. హైందవ సాంప్రదాయ వివాహ విధానాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణ మహోత్సవంలో పుణ్యాహవచనం అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, రక్షాబంధన, అగ్ని ప్రతిష్ట, వస్త్రసమర్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, ఎదురుకోళ్ళు, నక్షత్ర హారతి మెదలైన సాంప్రదాయ విధానాలను నిర్వహించి చివరగా మంగళహారతి నివేదనతో కల్యాణమహోత్సవాన్ని కన్నుల పండుగగా పూర్తి చేసారు.
 
ఈ సందర్భంగా తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపచేయడమే లక్ష్యంగా తితిదే ఈ శ్రీనివాస కల్యాణాలను గత ఏడేళ్ళుగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాలలో మాత్రమే కాకుండా విదేశాలలో సైతం నిర్వహిస్తోంది అన్నారు. ఎక్కడ ఈ కల్యాణాలు నిర్వహిస్తే అక్కడ శాంతి సౌభాగ్యాలు చోటుచేసుకుంటున్నాయని తమకు ఆ ప్రాంతపు ప్రజలు ఆనందోత్సహాలతో తెలుపుతున్నారు అన్నారు.
 
అనంతరం ఈ.ఓ శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ‘శ్రీనివాస కల్యాణం” పేరిట ఈ కల్యాణాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంతో హైందవ ధర్మ పరిరక్షతోపాటు సమాజంలో భక్తిభావాన్ని పెంచుతోందని, ఆధ్యాత్మిక విలువలను కూడా తితిదే ప్రచారం చేస్తోందని చెప్పారు. ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని తితిదే ఈ కల్యాణాల ద్వారా కల్పిస్తోందన్నారు. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ చక్కటి అవకాశాన్ని తితిదే కల్పించిందన్నారు. శ్రీవారి కల్యాణంతో స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికి అందాలని ఈవో ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో కేబినెట్‌ కార్యదర్శి శ్రీ సతీష్‌ చంద్ర, రాజ్యసభ ఎం.పి. శ్రీమతి జయప్రద, తిరుపతి జె.ఇ.ఓ. శ్రీ పి.వెంకటరామిరెడ్డి, తిరుమల జె.ఇ.ఓ శ్రీ.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి.అశోక్‌ కుమార్‌, శ్రీ వేంకటేశ్వర కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి హేమలతారెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ సూర్యప్రకాష్‌ రావు, ఇ.ఇ శ్రీ జగన్మోహన్‌ రెడ్డి, డిప్యూటి ఇ.ఇ శ్రీ ప్రకాష్‌ బాబు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.