SRINIVASA VASA KALYANAMS IN US FROM JUNE 18-JULY 9 _ జూన్ 18 నుంచి జూలై 9 దాకా అమెరికాలో పెద్ద ఎత్తున శ్రీనివాస కల్యాణాలు
AFTER A GAP OF OVER A DECADE KALYANAMASTU WILL BE ORGANIZED ON AUGUST 7 -TTD CHAIRMAN
TIRUMALA, 11 JUNE 2022: For the sake of Srivari devotees who have settled in the US TTD will be organizing celestial Srinivasa Kalyanams in eight cities from June 18 to July 9 said TTD Chairman Sri YV Subba Reddy.
Along with TTD EO Sri AV Dharma Reddy, speaking to the media at Tirumala on Saturday the Chairman said, due to the Covid effect, overseas could not been able to visit Tirumala for the past two and a half years.
Under the instructions of AP CM Sri YS Jaganmohan Reddy TTD will organize Srinivasa Kalyanams with the support of AP NRIs Association in the United States of America.
On June 18 in San Francisco, June 19 in Seattle, June 25 in Dallas, June 26 in St. Louis, June 30 in Chicago, July 2 in New Orleans, July 3 in Washington DC, July 9 in Atlanta.
The Chairman also said, after a gap of over a decade, TTD will be organizing Kalyanamstu-the free mass marriages to the poor on August 7 across the state.
To take forward Hindu Sanatana Dharma across the globe, TTD will organize more and more spiritual programmes in a big manner, he asserted.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 18 నుంచి జూలై 9 దాకా అమెరికాలో పెద్ద ఎత్తున శ్రీనివాస కల్యాణాలు
– భక్తులు ఉచితంగా కల్యాణంలో పాల్గొనవచ్చు
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 11 జూన్ 2022: అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో శనివారం ఆయన ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలసి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది