SRISAILAM DEVASTHANAM GOVERNING COUNCIL MEETS TTD CHAIRMAN _ టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్
TIRUMALA, 11 DECEMBER 2025: Srisailam Devasthanam Governing Council Chairman Sri P Ramesh Naidu along with board members met TTD Chairman Sri B.R Naidu at latter’s camp office on Thursday.
They requested the Chairman to cooperate in the development of Srisailam Devasthanam and requested the construction of new cottages in Srisailam.
TTD Board Chief assured that he will bring their request to the attention of the TTD Board and will be discussed.
The Srisailam Devastanam board later felicitated the TTD Board Chairman with Theertha Prasadams.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్
తిరుమల, 2025 డిసెంబర్ 11: టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు.
ఈ విషయంపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కు తెలియజేశారు.
అనంతరం టీటీడీ చైర్మన్ కు శ్రీశైలం దేవస్థానం బోర్డు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

