SRIVANI DARSHAN TICKET ALLOCATION MADE EASY _ సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు

TTD ADDITIONAL EO INAUGURATES NEW COUNTER FOR SRIVANI DARSHAN TICKETS
 
Tirumala, 13 November 2024: TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary informed that the process of allocating Srivani Darshan tickets offline in Tirumala has been made easier now.
 
He inaugurated the new counters for Srivani Darshan tickets at the back side of Gokulam Conference Hall on Wednesday morning. 
 
After performing special pujas at the counter, he personally took the details of the devotee and allotted the first ticket.
 
Speaking to the media on this occasion, the Additional EO said that a special counter has been set up after noticing that devotees were facing inconvenience in the queues of the previous Srivani counter when it rained. He said that Srivani devotees can now get tickets without any inconvenience.
 
He said that 900 tickets are being allotted offline per day.  Earlier, it took three to four minutes to allocate tickets, but now the application has been simplified to allot the tickets to devotees within one minute. He informed that devotees can easily purchase tickets through five counters.
 
TTD CE Sri Satya Narayana, Deputy EO Sri Rajendra, VGO Sri Surendra, AEO Sri Krishnayya and other officials participated in this program.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు

తిరుమల, 2024 నవంబరు 13: శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి.

తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.

రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్ లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఇ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.