SRIVARI ANNUAL BRAHMOTSAVAM WITH PILGRIM PUBLIC PARTICIPATION AFTER TWO YEARS _ రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు – సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వరకు మాడ వీధుల్లో వాహనసేవలు
NINE-DAY FESTIVAL BETWEEN SEPTEMBER 27 AND OCTOBER 5
KOIL ALWAR TIRUANJANAM ON SEPT 20 AND ANKURARPANAM ON SEP 26
GARUDA SEVA ON OCTOBER 1
Tirumala, 02 September 2022: The Hill Town of Tirumala is bracing up to host the annual nine-day mega festival of Srivari Brahmotsavams after a two-year hiatus.
The temple management of Tirumala Tirupati Devasthanams is all set to observe this mega religious fete in a big way this year and is anticipating huge turnout of the pilgrim public for all the vahana sevas besides Garuda Seva, since the annual fete was observed in Ekantam inside the temple in the last two years due to Covid Pandemic restrictions.
All the departments in Tirumala are gearing up for the annual festival which is scheduled between September 27 and October 5. A peep into the important events and vahana sevas scheduled during the ensuing annual brahmotsavams.
The traditional temple cleaning festival, Koil Alwar Tirumanjanam takes place in Tirumala temple on September 20 between 6am and 11am.
Important Days during Salakatla Brahmotsavams:
September 26: 7pm and 8pm: Ankurarpanam
September 27: Day 1: 5:15pm and 6:15pm: Dhwajarohanam, 9pm and 11pm: Pedda Sesha Vahanam
September 28: Day 2: 8am and 10am: Chinna Sesha Vahanam, 1pm and
3pm: Snapana Tirumanjanam, 7pm and 9pm: Hamsa Vahanam
September 29: Day 3: 8am and 10am: Simha Vahanam, 7pm and 9pm: Mutyapu Pandiri Vahanam
September 30: Day 4: 8am and 10am: Kalpavriksha Vahanam, 7pm and 9pm: Sarvabhoopala Vahanam
October 1: Day 5: 8am and 10am: Mohini Avataram, 7pm onwards: Garuda Vahanam
October 2: Day 6: 8am and 10am: Hanumantha Vahanam, 4pm and 5pm: Radharanga Dolotsavam (Golden Chariot), 7pm and 9pm: Gaja Vahanam
October 3: Day 7: 8am and 10am: Suryaprabha Vahanam, 1pm and 3pm: Snapana Tirumanjanam, 7pm and 9pm: Chandraprabha Vahanam
October 4: Day 8: 7am onwards: Rathotsavam (Wooden Chariot), 7pm and 9pm: Aswa Vahanam
October 5: Day 9: 6am and 9am: Chakra Snanam, 9pm and 10pm: Dhwaja Avarohanam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
– సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వరకు మాడ వీధుల్లో వాహనసేవలు
– సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ
తిరుమల, 2022 సెప్టెంబరు 02: తిరుమలలో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి సమాయత్తమవుతోంది. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయి.
కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనుండడంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టిటిడి అంచనా వేస్తోంది. ఈ క్రమంలో భక్తులకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు:
– సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ.
– సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం.
– సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనం.
– సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం.
సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం.
అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.
అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనం.
అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనం.
అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.