SRIVARI BRAHMOTSAVAMS IN EKANTHAM- TTD CHAIRMAN _ ఈసారి కూడా ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
DECISION IN VIEW OF HEALTH SAFETY OF DEVOTEES & TTD STAFF
Tirumala, 17 September 2021: TTD Chairman Sri YV Subba Reddy announced that the annual Srivari Brahmotsavams this year too will be held in Ekantam keeping in view the health safety of devotees and TTD employees.
Speaking to reporters at Annamaiah Bhavan on Friday the Chairman said the decision was in adherence to new Covid guidelines issued by the Central & State Governments in view of possibility of Third wave likely in October.
He said only 15,000 to 20,000 devotees are being provided Srivari Darshan daily in consonance with Covid regulations of sanitisation, mask, social distancing. He said curbs in Darshan would continue for some more time and temple activities will be restricted till normalcy is restored.
The Chairman said due to technical snags the online issue of SSD tokens is being delayed and soon after rectifying the problem, the SSD tokens will soon be issued in online.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఈసారి కూడా ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
* భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం
టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి వెల్లడి
తిరుమల 17 సెప్టెంబర్ 20 21: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు. ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని చెప్పారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.