SRIVARI DARSHAN TOKENS TO LOCALS ON MAY 4 _ మే 4న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ
TIRUMALA, 02 MAY 2025: TTD will issue tokens related to Local Darshan Quota on Sunday(May 04) as a part of darshan being provided to the locals on the first Tuesday of every month.
To this extent, Srivari darshan tokens will be issued from 5 am onwards on first-come, first-served basis to the Tirupati residents at the counters in the Mahathi Auditorium and to the Tirumala residents at the Balaji Nagar Community Hall.
The local devotees belonging to Tirupati Urban, Tirupati Rural, Chandragiri and Renigunta mandals are requested to show their Aadhaar card and get tokens on Sunday in these places and avail darshan facility on these tokens on Tuesday, the May 06.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 4న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ
తిరుమల, 2025 మే 02: ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తేది) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మే 4వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.
ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.