SRIVARI FLOAT FESTIVAL FROM MARCH 24-28 _ మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala, 17 Mar. 21: TTD is organising a five-day annual Srivari float festival (Teppotsavam) at Swami Pushkarini in Tirumala from March 24-28.

Teppotsavam, also known as Tirupalli Vodai Tirunal in Tamil and Teppa Tirunallu in Telugu, is symbolic to Sri Venkateswara annual boat festival celebrations.

Legends say that the float festival has been in vogue since time immemorial and in 1468 a Nirala Mandapam was built in the Swami Pushkarini by King Saluva Narasimha Raya.

In the 15th century, Saint Poet Sri Tallapaka Annamacharya had described the Teppotsavam in his sankeetans.

The festival of a procession of utsava idols of Sri Malayappa and His consorts in serene waters of Swamy Pushkarini in the evenings, ahead of summer months is always a cynosure.

On the first day, the utsava idols of Sri Sitalakshmana Anjaneya sameta Sri Ramachandramurty adorn the float. On the second day Utsava idols of Rukmini sameta Sri Krishna go round three times.

On the last three days, Sri Malayappa Swamy and His consorts Sri Devi and Sri Bhudevi go for three, five and seven rounds respectively to regale and bless devotees.

ARJITA SEVAS CANCELLED

In view of Teppotsavams, the TTD has cancelled the arjita sevas (virtual) including Sahasra Deepalankara on March 24 and 25, Arjita Brahmotsavam and Sahasra Deepalankara from March 26 to 28.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, 2021 మార్చి 17: తిరుమలలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వ‌ర్చువ‌ల్‌‌), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ ‌(వ‌ర్చువ‌ల్)లను టిటిడి రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.