SRIVARI KALYANAM AT CHITRAKOOT _ చిత్రకూట్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

TIRUMALA, 22 JANUARY 2025: Srivari Kalyanotsavam was held in a grand manner at the mythologically significant place of Chitrakoot at UP in the Uttaradi Ahobila Mutt on Tuesday.
 
As per sacred texts, Chitrakoot happens to be the place where Sri Rama along with Sita Devi and Lakshmana Swamy stayed for 12years.
 
After a series of traditional rituals, the celestial marriage was performed to the Utsava deities which immersed devotees in devotion.
 
HH 1008 Rajguru Peethadhishwar Swamy Badrinath Prasannacharyaji, Estate Officer Sri Gunabhushan Reddy and others were present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

చిత్రకూట్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

తిరుమల, 2025 జనవరి 22 ; మహా కుంభమేళా సందర్భంగా త్రేతా యుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పవిత్రస్థలమైన మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ నగరంలో ఉత్తరాది అహోబిల మఠంలో బుధవారం ఉదయం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ 1008 రాజ్ గురు పీఠాదీశ్వర్ స్వామి బద్రి ప్రపన్నాచార్యజీ మహరాజ్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.