SRIVARI LAKSHMI KASULA HARAM SHOBHA YATRA HELD _ వైభవంగా శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర

Rs. 6.40cr WORTH YAGNOPAVEETAM PRESENTED TO KALYANA VENKATESWARA

Tirupati, 12 February 2026: Srivari Lakshmi Kasula Haram Shobhayatra began in a grand style from the TTD administrative building in Tirupati on Thursday.

As a part of the ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy, the garland will be decorated on Thursday night to commemorate the Garuda Seva. 

Speaking on the occasion, the Additional EO Sri Ch Venkaiah Chowdary said it has been a practice to decorate the famous Lakshmi Kasula Haram of Tirumala Srivaru to adorn Garuda Seva of Sri Venkateswara  Swamy. 

JEOs Sri Veerabrahamam,Dr. Sharath, CVSO Sri Murali Krishna participated in this program.

Yagnopaveetam presented

On this occasion, TTD presented a 6-petal gold Yagnopaveetam with a 4 kg diamond Mopu, worth about Rs. 6.40 crores was also presented to the Sri Kalyana Venkateswara as a gift from Tirumala temple on the occasion.

Earlier, the Srivari Lakshmi Kasula Haram was brought from the Tirumala Temple by Peishkar Sri Ramakrishna to the TTD Administration Building in Tirupati.

This Lakshmiharam Shobha Yatra started from the TTD administrative building in Tirupati and reached Srinivasa Mangapuram covering Sri Kodanda Ramalayam, Ramachandra Pushkarini, Mahathi Auditorium. 

The procession continued with religious fervour amidst bhajans and kolatams by dance troupes. 

TTD Trust Board members Sri Bhanuprakash Reddy, Smt Panabaka Lakshmi, District SP Sri Subbarayudu, Temple Special Grade Deputy EO Smt. Varalaxmi, VGOs Sri Ram Kumar, Sri Giridhar, other officials, priests also participated in this program.

A large number of devotees and Srivari Sevaks were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుపతి, 2026, ఫిబ్రవరి 12: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం, డా. ఎ. శరత్, సివిఎస్వో శ్రీ కే. వి. మురళీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ సందర్భంగా టిటిడి నుండి దాదాపు రూ. 6.40 కోట్లు విలువగల 4 కేజీల డైమండ్ మోపుగల 6 పేటల బంగారు యజ్ఞోపవీతము స్వామి వారికి అందించినట్లు తెలిపారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పెష్కార్ శ్రీ రామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.

ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామ స్వామి, రామచంద్ర పుష్కరిణి మీదుగా మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. 

ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ పనబాక లక్ష్మీ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, విజివోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ గిరిధర్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.