SRIVARI PADUKALA PROVESSION HELD _ వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు
Tirupati, 22 November 2025: On the sixth day of the ongoing annual Karthika Brahmotsavam of Sri Padmavati Ammavaru in Tiruchanoor on Saturday, the procession of Srivari Swarna Padukalu was held in a grand manner.
The golden shoes of the Lord were first brought from the Tirumala Srivari temple to the Pasupumandapam in Tiruchanoor.
After performing special pujas there, they were taken in a procession to the Ammavari temple amidst Mangalavaidyams, bhajans and kolatams.
It is a tradition to bring the golden shoes of the deity on the day of Garuda Seva of the Ammavaru.
The deity graces devotees wearing these Padukas on Garuda Seva on the sixth evening.
TTD CVSO Sri K.V. Muralikrishna, Temple Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Temple Inspector Sri Subhash, other high officials, priests and a large number of devotees participated in this program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు
తిరుపతి, 2025 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుభాష్, ఇతర ఉన్నతాధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




