SRIVARI PRESENTS GOLD CROWN AND YAGNOPAVEETAM ON KALYANAM ON SITARAMA _ సీతారాములకు శ్రీవారి కానుక

Vontimitta/Tirumala, 11 April 2025: On the occasion of the celestial Kalyanam precious jewels were gifted to Sri Sita Rama by Sri Venkateswara Swamy from Tirumala on Friday.
 
On the auspicious occasion of the celestial Kalyanam, a golden crown and an Yagnopaveetham were gifted to Sita Devi and Sri Ramachandra Murthy respectively.
 
It is a tradition for TTD affiliated temples to send gifts from Tirumala Srivari Temple on the occasion of Brahmotsavam. As part of this, these ornaments were presented on Friday. 
 
After performing pooja to the ornaments they were presented to the deities of Sri Sita Rama.
 
Temple Officials participated.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సీతారాములకు శ్రీవారి కానుక

•⁠ ⁠సీతమ్మకు స్వ‌ర్ణ కిరీటం, రామయ్యకు య‌జ్ఞోప‌వీతం బహూకరణ

ఒంటిమిట్ట / తిరుప‌తి, 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారు శుక్ర‌వారం కానుకలు పంపారు .

కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శుభ సందర్బంగా స్వ‌ర్ణ‌ కిరీటం, య‌జ్ఞోప‌వీతం ఆభరణాలను కానుకగా అందించారు.

టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే శుక్ర‌వారం ఈ ఆభరణాలు సమర్పించారు.

ఆలయం ముందు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీ.ఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీవీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేశ్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.