SRIVARI SALAKATLA TEPPOTSAVAM BEGINS _ శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Tirumala, 09 March 2025: Srivari Salakatla Teppotsavam in Tirumala started on Sunday evening.  Sri Ramachandramurthy along with Sri Sita Lakshmana Anjaneya appeared on a boat finely decorated with electric lamps and flowers.

Earlier at 6pm, the procession of the Utsavamurtis started and reached  Pushkarini, parading through the four mada streets of the temple. 

On the first day, Sri Sita Rama Lakshmana Anjaneya Swamy blessed devotees by taking three rounds on the sacred waters of Pushkarini. 

HH Tirumala Sri Pedda Jeeyar Swamy, HH Tirumala Sri Chinna Jeeyar Swamy, Additional EO Sri Ch Venkaiah Chowdary, Deputy EO Sri Lokanatham, Garden Deputy Director Sri Srinivasulu and other officials participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణఆంజనేయులు తెప్పపై విహారం

తిరుమల, 2025 మార్చి 09: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది.

తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఈ ఈ లు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ సుధాకర్, డి ఈ శ్రీ చంద్రశేఖర్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.