SRIVARU PRESENTS Rs.2.5 CRORE WORTH ORNAMENTS TO SRI PADMAVATHI DEVI AS B-DAY GIFT _ శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
Tirumala, 18 November 2023: Tirumala Sri Venkateswara presents precious ornaments to His love on the auspicious day of Panchami Theertham which happens to be the Janma Tithi of Sri Padmavathi Devi.
On the final day of the annual Karthika Brahmotsavam at Tiruchanoor temple a grand Sare and two ornaments were presented to Ammavaru on behalf of Srivaru on Saturday morning.
As part of the annual tradition the TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy, amidst a grand procession from Tirumala to Tiruchanoor handed over the presentation.
Speaking to media on the occasion the TTD Chairman said the holy Sare was brought on foot from Tirumala in a procession to Sri Padmavati temple at Tiruchanoor. He said TTD has made all arrangements for the holy bath by lakhs of devotees in the Padma Sarovar.
TTD EO said Yajnopaveetham and Lakshmi Kasulamala both weighing 5 kgs and worth ₹2.5 crore are presented to Sri Padmavati on the celestial occasion.
Earlier the Sare and ornaments procession commenced at Tirumala in the early hours carrying atop temple elephant along the Mada streets and thereafter on foot up reached Alipiri.
The presentation also comprised of perfumes, sandal powder, Tulasi, Kasturi and Karpooram besides five varieties of Prasadams including Laddu, Vada, Jilebi, Tendolam, Appam in the Padi.
At Alipiri TTD EO handed over the sare to JEO Sri Veerabrahmam who carried it in a procession up to Pasupu Mandapam in Tiruchanoor. After special pujas, they were taken along Mada streets and presented to Goddess Padmavati at Padma Pushkarani.
Temple DyEO Sri Govindarajan and other officials and a large number of devotees were also present in the religious event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
– రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బంగారు కాసులమాల, యజ్ఞోపవీతం సమర్పణ
తిరుమల, 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలో ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమితీతం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా సారె ఊరేగింపు మొదలైందని తెలిపారు. ఈ సారె ఊరేగింపుగా కాలినడకన తిరుపతిలోని అలిపిరి, కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అద్భుతంగా నిర్వహిస్తోందని చెప్పారు.
ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం నుండి రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, యజ్ఞోపవీతం అమ్మవారికి కానుకగా సమర్పిస్తున్నట్టు తెలియజేశారు.
ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆభరణాలతో కూడిన శ్రీవారి సారెను జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడినుండి కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం వద్దకు సారె చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధుల గుండా ప్రదక్షిణగా వెళ్లి పద్మపుష్కరిణిలో అమ్మవారికి సారె సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.