SSD INTRODUCED ONLY TO PROVIDE DARSHAN TO COMMON PILGRIM ON PAR WITH VIP _ సామాన్య భక్తులకు విఐపి భక్తుల తరహలో దర్శన భాగ్యం కల్పిచేందుకే స్లాటెడ్ విధానాన్ని అనుసరించాం
TOKEN SYSTEM CANCELLED AND DEVOTEES ALLOWED DIRECTLY TO DARSHAN
NO INCONVENIENCE IS CAUSED TO DEVOTEES BY TTD
SOME VESTED INTERESTS CREATING UNNECESSARY FURORE AGAINST TTD
TTD ADDITIONAL EO
TIRUMALA, 13 APRIL 2022:. TTD Additional EO Sri AV Dharma Reddy on Wednesday said TTD has introduced Slotted Sarva Darshan with an aim to provide hassle-free darshan to devotees on par with VIPs.
Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala he said TTD has introduced SSD tokens in Tirupati since 2016. TTD has temporarily suspended the issue of tokens on 9th since tokens were already issued for three days.
Again from April 12 onwards, TTD has commenced issuing of 35,000 SSD tokens from 6am. During the time of the issue of tokens there were only 20,000 devotees. But panic by some devotees was the cause for pell-mell in the queue lines.
In view of the unprecedented crowds seen on Tuesday, we suspended the SSD tokens system and allowed all devotees who assembled there to visit Tirumala directly.
As we had made advance preparations, we could route all the devotees into compartments within half an hour.
Because of current crowds the devotees had to wait in the compartments till their turn for Darshan.
But taking the advantage of the situation some vested interests indulged in mud slinging against TTD.
Giving priority to common devotees, we have suspended VIP Break Darshan till April 17.
To those who are pointing fingers at TTD, the Additional EO said TTD has been conducting various Dharmic programs from the last three years like never before which won global applause.
In spite of a volley of threats we determinedly without backing out eliminated the dalari (brokers) system completely. However, a few vested elements were still misleading the campaign against TTD which is so sad on their part, he maintained.
The Additional EO said TTD is mulling to open the Srivari Mettu footpath route by April 30.
TTD CVSO Sri Narasimha Kishore was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సామాన్య భక్తులకు విఐపి భక్తుల తరహలో దర్శన భాగ్యం కల్పిచేందుకే స్లాటెడ్ విధానాన్ని అనుసరించాం
– టిటిడి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించలేదు
– సర్వదర్శనం టోకెన్ విధానాన్ని రద్దు చేసి తిరుమలకు అనుమతి
– కొంతమంది పని గట్టుకుని టిటిడిపై దుష్ప్రచారం
– టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 ఏప్రిల్ 13: సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా విఐపి భక్తుల తరహలో తిరుమల శ్రీవారి దర్శనం కల్పిచేందుకే టైం స్లాటెడ్ విధానాన్ని అనుసరించామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం అదనపు ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు ఈవో మాట్లాడుతూ, 2016వ సంవత్సరం నుండి తిరుపతిలో ఎస్ఎస్‌డి టోకెన్లను టిటిడి జారీ చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన మూడు రోజులకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడం పూర్తవ్వడంతో టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు బుధ, గురు, శుక్రవారాలకు సంబంధించి రోజుకి 35 వేల టోకెన్లు జారీ చేసే ప్రకియ ప్రారంభించామని చెప్పారు. శ్రీ గోవిందరాజస్వామివారి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద టోకెన్లు జారీ చేసే సమయంలో కేవలం 20 వేల మంది భక్తులు మాత్రమే వున్నారని తెలిపారు. భక్తులు అదేరోజు దర్శన టోకెన్లు పొందాలనే ఆత్రుత కారణంగా క్యూ లైన్లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. దర్శన టోకెన్లు ఉన్నాయని సిబ్బంది ఎంతగా నచ్చచేప్పినా, భక్తులు వినక పోవడం వల్ల స్వల్ప తోపులాట జరిగిందన్నారు. నిన్నటి ఘటన నేఫథ్యంలో వెంటనే సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని రద్దు చేసి తిరుమలకు భక్తులను అనుమతించామన్నారు.
ప్రస్తుత విధానంతో భక్తులు కంపార్టుమెంట్లలో వేచి వుండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గంటల తరబడి కంపార్టుమెంట్లలో వేచి ఉండటం అంటే భక్తులను ఇబ్బంది పెట్టడమే అవుతుందన్నారు. ప్రస్తుతానికి విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసి, నాలుగు రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమన్నారు.
భక్తుల రద్దీని టీటీడీ సరిగా మేనేజ్ చేయలేకపోయిందని కొంతమంది ఆరోపించడం బాధాకరమన్నారు. ముందస్తుగా సిద్దంగా వున్నాం కాబట్టే అరగంటలోనే భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించామన్నారు. అయినా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయని శ్రీ ధర్మారెడ్డి వివరించారు. భక్తుల రద్దీపై టిటిడి అప్రమత్తంగా లేదనడంలో వాస్తవం లేదని, రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటనను కొంత మంది గోరంతను కొండంతచేసి టీటీడీ పై దుష్ప్రచారం చేశారన్నారు.
గత మూడు సంవత్సరాలుగా తిరుమలలో గతంలో ఎన్నడు లేని విధంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా తిరుమలలో దళారులను నిర్మూలించినట్లు తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు పున:ప్రారంభిస్తామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Text content