SSD TAKING TWO DAYS _ సర్వదర్శనం టైంస్లాట్ భక్తులకు రెండో రోజు దర్శనం

TIRUMALA, 27 MARCH 2022: In view of the week rush coupled with Koil Alwar Tirumanjanam on March 29, the Sarva darshan for pilgrims is taking almost two days.

To facilitate common pilgrims with more darshan time, TTD has even cancelled VIP Break Darshan on March 29 and already stated that no recommendations letters will be entertained on Monday, March 28.

As such, the TTD has appealed to the SSD token devotees to plan their pilgrimage accordingly to avoid the inconvenience of long waiting hours in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వదర్శనం టైంస్లాట్ భక్తులకు రెండో రోజు దర్శనం

తిరుమల, 2022 మార్చి 27: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది.

సాధారణ భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకు మార్చి 29న విఐపి బ్రేక్ దర్శనాన్ని కూడా టిటిడి రద్దు చేసింది. ఇందుకోసం మార్చి 28న సోమవారం ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో తిరుమలలో దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండడంతో సర్వదర్శనం భక్తులు తదనుగుణంగా తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొంచుకోవాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.