STONE-STUDDED BANGLE GARLANDS ADORN DEITIES FOR THE FIRST TIME _ గాజులు, ఆప్రికాట్, వట్టివేరు, కురువేరుమాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం
MIXED DRY FRUITS, WHITE PEARLS, WILD KHUS GARLANDS STEAL THE SHOW
ORCHID CANOPY GLORIFY SNAPANA MANDAPAM
TIRUMALA, 24 SEPTEMBER 2023: The Snapana Tirumanjanam was observed for the third and last time during the ongoing nine-day annual brahmotsvams in Tirumala on Sunday in the temple of Sri Venkateswara.
For the first time, garlands and crowns made of stone studded bangles were decked to the processional deities of Sri Malayappa, Sridevi and Bhudevi besides yellow rose petals, mixed dry fruits, kuruvetiver, various rose petal garlands after snapanam was performed with each sacred ingredient. The entire premises was tastefully decorated with different orchids hanging from the roof.
Both the senior and junior pontiffs of Tirumala, EO Sri AV Dharma Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2023
గాజులు, ఆప్రికాట్, వట్టివేరు, కురువేరుమాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం
తిరుమల, 2023 సెప్టెంబరు 24: రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో రంగురాళ్లతో కూడిన గాజుల మాలలు, ఆప్రికాట్ మాలలు, వట్టివేరుమాలలు, కురువేరుమాలలు, రంగురంగుల రోజామాలలు, పసుపు రోజామాలలు, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ మాలలు, తెలుపు ముత్యాల మాలలు, కిరీటాలు, తులసి మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన శ్రీ రాజేందర్ ఈ మాలలను విరాళంగా అందించారు. అదేవిధంగా, హైదరాబాదుకు శ్రీ శ్రీహరి, శ్రీ శ్రీధర్, శ్రీ శ్రీనివాస్ విరాళంతో రంగనాయకుల మండపంలో సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లతో విశేషంగా అలంకరించారు.
టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.