STUDENTS EXTEND DIWALI GREETINGS _ టీటీడీ ఈవోకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

TIRUMALA, 09 NOVEMBER 2023: The students of TTD-run SV High School in Tirumala formally met TTD EO Sri AV Dharma Reddy in his Bungalow at Hill Town on Thursday evening and extended Deepavali greetings.

On this occasion, the students presented the Diyas crafted by them. The parents of the pupils thanked EO for enhancing the standards of education by handing over it to Singhania Educational Trust.

Head Master Sri Surendra Babu, Co-ordinator Sri Syambabu, students were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ ఈవోకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

తిరుమ‌ల‌, 2023 న‌వంబ‌రు 09: తిరుమ‌ల‌లోని ఎస్వీ హైస్కూల్ విద్యార్థులు గురువారం సాయంత్రం తిరుమ‌ల‌లోని బంగ‌ళాలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిని క‌లిసి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ను, మట్టి బొమ్మ‌ల‌ను ఈవోకు బ‌హుమ‌తిగా అంద‌జేశారు. విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఈవోతో మాట్లాడుతూ పాఠ‌శాల‌ను సింఘానియా గ్రూపు ద‌త్త‌త తీసుకుని విద్య‌ప‌రంగా, మౌలిక సౌక‌ర్యాలప‌రంగా చ‌క్క‌గా అభివృద్ధి చేసింద‌ని అన్నారు. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్నందుకు ఈవోకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ సురేంద్ర‌బాబు, కో-ఆర్డినేట‌ర్ శ్రీ శ్యాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.