STUDENTS SHOULD REWRITE HISTORY AP MINISTER RK ROJA _ విద్యార్థినులు చ‌రిత్ర సృష్టించాలి – రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ‌మ‌తి ఆర్‌కె.రోజా

ADDRESSES ALUMNI ANNUAL MEET OF SPWDPGC

 

Tirupati, 28,l November 2023: The Honourable Minister for Tourism, Culture and Youth Advancement of Andhra PradeshSmt RK Roja on Tuesday exhorted girl students to excel in every chosen field fighting against all odds and insults which they come across

in their journey to achieve their goals and rewrite history. 

 

Addressing the Annual Alumni Meet in the TTD run seven decades old Sri Padmavati women’s degree and PG college as its chief guest the AP minister who was a student over three decades ago from the college said studying in TTD educational institutions itself is a huge blessing to the students. She expressed immense happiness and became emotional for visiting the college after three decades terming it as the most memorable and unforgettable moment in her life.

 

She said when she was pursuing her education there are no avenues like what the girl students are having now. The Governments today are promoting women education extensively and all student should utilize the opportunity to achieve goals and bring glory to their institution, teachers and parents. 

 

She thanked her lecturers on the occasion and advocated that studying in SPW helped her to build a successful career in her life be it film industry or politics. 

 

Dr Krishna Prashanti who is a contemporary of Smt Roja, Retired Telugu Head of the Department and Octogenarian  Dr DM Premavati, TTD DEO Dr Bhaskar Reddy also spoke on the occasion.

 

Cultural shows presented by students in the afternoon session enthralled all.

 

College Principal Dr Mahadevamma, Alumini president Smt Vasudha, Warden Smt Vidyullata, Telugu HoD Dr Krishnaveni, retired Principal Dr  Swarajya Lakshmi,  old students and students were also present. 

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విద్యార్థినులు చ‌రిత్ర సృష్టించాలి – రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ‌మ‌తి ఆర్‌కె.రోజా

– శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పిజి క‌ళాశాల‌లో పూర్వ విద్యార్థినుల స‌మ్మేళ‌నం

తిరుపతి, 28 నవంబరు 2023: విద్యార్థినులు ఎలాంటి భ‌యాందోళ‌న‌ల‌కు లోనుకాకుండా ధైర్యంగా ముంద‌డుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ‌మ‌తి ఆర్‌కె.రోజా పిలుపునిచ్చారు. తిరుప‌తిలోని టీటీడీకి చెందిన శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పిజి క‌ళాశాల‌లో మంగ‌ళ‌వారం వార్షిక పూర్వ‌విద్యార్థినుల స‌మ్మేళ‌నం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క‌ళాశాల పూర్వ‌విద్యార్థిని, రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ‌మ‌తి ఆర్‌కె.రోజా విద్యార్థినుల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీ‌వారి పాదాల చెంత‌గ‌ల ఈ క‌ళాశాల‌లో చ‌దువుకోవ‌డం విద్యార్థినుల పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌న్నారు. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌రువాత తిరిగి క‌ళాశాల‌లో త‌న గురువుల‌ను క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళావిద్య‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఉన్న‌త‌స్థాయికి చేరుకోవాల‌ని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ ఒక ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర‌చుకుని, దాన్ని సాధించేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాల‌న్నారు. అనుకున్న స్థాయికి చేరుకుని త‌ల్లిదండ్రుల‌కు, క‌ళాశాల‌కు, గురువుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని సూచించారు. తాను ఈ స్థాయికి రావ‌డానికి స‌హ‌క‌రించిన క‌ళాశాల అధ్యాప‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

మ‌రో పూర్వ విద్యార్థి, తిరుప‌తికి చెందిన ప్ర‌ముఖ వైద్యురాలు డాక్ట‌ర్ కృష్ణ‌ప్ర‌శాంతి మాట్లాడుతూ విద్యార్థినుల‌కు ఏకాగ్ర‌త ముఖ్య‌మ‌ని, దాన్ని పెంపొందించుకుంటే ఉన్న‌త‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చ‌ని చెప్పారు.

 క‌ళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిప‌తి డా. డిఎం.ప్రేమావ‌తి మాట్లాడుతూ 70 ఏళ్ల అపూర్వ‌మైన చ‌రిత్ర క‌ళాశాల సొంత‌మ‌ని, వేలాది మంది విద్యార్థినుల‌ను విద్యావంతులుగా తీర్చిదిద్దింద‌ని తెలిపారు.

టీటీడీ విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్క‌ర్‌రెడ్డి మాట్లాడుతూ క‌ళాశాల‌లో చ‌దువుకున్న విద్యార్థినులు చాలా రంగాల్లో ఉన్న‌త స్థానాల్లో ఉన్నార‌ని తెలిపారు. క‌ళాశాల‌కు ఏ ప్ల‌స్ గ్రేడ్ వ‌చ్చింద‌ని, అటాన‌మ‌స్ దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని చెప్పారు.

కార్య‌క్ర‌మం అనంత‌రం నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. మ‌హ‌దేవ‌మ్మ‌, అల్యూమినీ ప్రెసిడెంట్ శ్రీ‌మ‌తి వ‌సుధ‌, వార్డెన్ శ్రీ‌మ‌తి విద్యుల్ల‌త, తెలుగు అధ్యాప‌కురాలు డా.కృష్ణ‌వేణి, పూర్వ ప్రిన్సిపాల్ డా. స్వ‌రాజ్య‌ల‌క్ష్మి ఇత‌ర అధ్యాప‌కులు, పూర్వ‌విద్యార్థినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.