STUPENDOUS PERFORMANCES BY ARTISTS _ సూర్యప్రభ వాహన సేవలో ఆకట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

TIRUPATI, 16 NOVEMBER 2023: Cultural teams from several states organised by the Hindu Dharmic projects held the devotees spellbound by their presentation of dance and sankeertans in front of Surya Prabha and Chandra Prabha Vahanams on Thursday during the ongoing Karthika Brahmotsavams at Tiruchanoor temple.

The Surya Thillana dance by a 35-member team from Rajahmundry with settings of sunflowers, seven horses and Surya Narayana Swami with consorts was the highlight of the day. While in the evening the performances by drums and kolatas were hailed by devotees.

On the other hand, the programmes at Mahati, Annamacharya Kalamandiram, Sri Ramachandra Pushkarini and Urban Haat enthralled the locals.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహన సేవలో ఆకట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2023 నవంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన గురువారం ఉద‌యం సూర్యప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్ర‌ల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 11 కళాబృందాలలోని కళాకారులు సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు.

రాజమండ్రికి చెందిన 35 మంది కళాకారులు సూర్య కుటుంబంలో ఛాయాదేవి, సంగ్యా దేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి, ఏడు గుర్రాలు, రథసారథి , ప్రొద్దు తిరుగుడు పువ్వులు తదితర సెట్టింగ్ తో చేసిన సూర్య టిల్లానా డాన్స్ భక్తులను పరవశింపజేసింది. అదేవిధంగా రాజమండ్రిలోని శ్రీ గోవిందరాయ కోలాట భజన మండలికి చెందిన 30 మంది కళాకారులు కృష్ణ ఫోక్ డాన్స్, 20 మంది కళాకారులు తీన్మార్ డ్రమ్స్, మాండవ్య శ్రీనివాస భజన మండలికి చెందిన 26 మంది యువతుల కోలాటాలు
కనువిందు చేశాయి .

గుంటూరుకు చెందిన 25 మంది యువతులు అన్నమయ్య సంకీర్తనలకు కూచిపూడి నాట్యం, తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన 15 మంది చిన్నారుల భరతనాట్యం అలరించింది.

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శంకర నాట్య విద్యాలయకు చెందిన 18 మంది కళాకారులు కృష్ణ ఫోక్ డాన్స్, కుంభకోణంకు చెందిన 25 మంది కళాకారుల అష్టలక్ష్మి సెట్టింగ్, రాధాకృష్ణులతో వైలాట్యం నృత్యం నయనానందకరంగా సాగింది.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీకి చెందిన 21 మంది మహిళలు బోనం కోలాటం, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన శ్రీ షణ్ముఖ శివ మాధవ కోలాట భజన మండలిలోని 34 మంది కళాకారుల కోలాటం, వివిధ దేవత మూర్తుల వేషధారణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.