SUBHAKRUTNAMA UGADI ASTHANAM HELD _ తిరుమల శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం

TIRUMALA, 02 APRIL 2022: The Subhakrutnama Ugadi Asthanam was held with religious fervour in Tirumala temple on Saturday.

 

The Asthanam was held in Bangaru Vakili where in the processional deities of Srivaru and His consorts along with Visvaksena was seated facing Garudalwar.

 

New vastrams were offered to all the deities on the auspicious occasion. Later the Panchanga Shravanam was carried out in the presence of deities. Afterwards, the traditional Rupai Harati was offered and Naivedyam was distributed.

 

TTD Board Chairman Sri YV Subba Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, JEO (H & E) Smt Sada Bhargavi, Temple Deputy EO Sri Ramesh Babu, Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy were present.

 

Among others, Honourable Minister of AP Sri Perni Nani, TTD board members Sri Sriramulu, Sri Maruti Prasad, Sri Nanda Kumar and Sri Krishna Rao were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం

తిరుమల, 2022 ఏప్రిల్ 02: తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

అనంత‌రం టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాల‌లో ఉండే తెలుగు ప్ర‌జ‌ల‌కు నూత‌న శ్రీ శుభ‌కృత్‌నామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. శ్రీ‌వారి ఆనుగ్ర‌హంతో క‌రోనా మ‌హ‌మ్మారి నుండి బ‌య‌ట‌ప‌డి దేశ వ్యాప్తంగా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌ని చెప్పారు. రాబోవు రోజుల్లో ఇలాంటి ప్ర‌మాదాలు లేకుండా లోకంలోని మాన‌వాళిని కాపాడాల‌ని శ్రీ‌వారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. ఈ నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో, సుఖ‌సంతోషాల‌తో, సిరిసంప‌ద‌ల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గౌ.శ్రీ పెర్నివెంక‌ట‌రామ‌య్య, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ రాములు, శ్రీ మారుతి ప్ర‌సాద్‌, శ్రీ కృష్ణారావు, శ్రీ నంద‌కుమార్‌, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ పేష్కర్ శ్రీ శ్రీ‌హ‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.