SUBRAMANYA HOMAM COMMENCES _ కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం

TIRUPATI, 05 NOVEMBER 2024: As a part of the month-long Homa Mahotsavams, Sri Subramanya Homam commenced in Sri Kapileswara Swamy temple on Tuesday.

This Homam will continue for three days till November 07.

On the last day the celestial wedding of Sri Valli Devasena sameta Sri Subramanya Swamy will take place.

Devotees shall have to pay Rs.500 on which two persons will be allowed in the Kalyanam that takes place between 5:30pm and 7:30pm

DyEO Sri Devendra Babu, temple inspector Sri Bala Krishna, other officials were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం

 తిరుప‌తి, 2024 నవంబరు 05: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

కాగా, నవంబ‌రు 6, 7వ తేదీల్లో కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా నవంబ‌రు 7న‌ సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌క్రిష్ణ‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.