SUBRAMANYA SWAMY HOMAM AT SRI KT _ కపిలతీర్థంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం
Tirupati, 19 November 2020: As part of month-long Karthika mahotsavam, TTD organised Sri Subramanya swami Homam at Sri Kapileswara Swamy temple on Thursday morning.
In yagashala Laghu Purnahuti, Nivedana, Harati were performed.
Later in the evening Homam, Sahasra Namarchana and Vishesha Deeparadhana were conducted.
Sri Subramanya swami Homam will be performed on Friday as well. In the evening, Sri Valli Devasena sameta Sri Subramanya Swami Divya Kalyanam Mahotsavam will be observed in Ekantkam.
Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple inspector Sri Reddy Sekhar, Temple archakas and other staff were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కపిలతీర్థంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం
తిరుపతి, 2020 నవంబరు 19: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్రత్యేక కార్యమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
కాగా శుక్రవారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. శుక్రవారం సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరిండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.