SUNDARA RAJA SWAMY UTSAVAMS _ జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

TIRUPATI, 27 MAY 2022: The annual Sundara Raja Swamy Avatara Mahotsavams in Tiruchanoor temple from June 20-22.

 

Every day there will be Abhishekam between 2pm and 3:30pm. On first day evening Pedda Sesha Vahanam, second day evening Hanumantha Vahanam, last day Garuda Vahanam takes place.

 

During these three days Unjal Seva remains cancelled.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2022 మే 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూన్ 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం శ్రీ సుందరరాజస్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చ‌న నిర్వహిస్తారు.

జూన్ 20, 21, 22వ తేదీలలో మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపములో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ జరుగుతుంది.

జూన్ 20వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

జూన్ 21వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

జూన్ 22వ తేదీ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జూన్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊంజ‌ల‌సేవను రద్దు చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.