SUNDARAKANDA AKHANDA PARAYANAMS AMPLIFY BHAKTI WAVE AT TIRUMALA _ భక్తిభావాన్ని పంచిన సుందరకాండ అఖండ పారాయణం
Tirumala, 2 May 2021: The 13th edition of sundarakanda Akhanda parayanams held at the Nada Niranjanam platform amplified the Bhakti waves at Tirumala on Sunday morning.
TTD organised the divine parayanams of 171 shlokas of 54-57 sargas by Veda pundits in total adherence to the Covid-19 guidelines.
Speaking on occasion Sri Kuppa Shiva Subramanya Avadhani, principal of Dharmagiri Veda vijnan peetham, said for the well being of humanity from pandemic Corona, the parayanams of significant episodes of Lanka -Dahanu and Rakshasa-Samhara Of Sundarakanda was observed on Sunday.
He said the Mantra parayana Mahotsavam organised by TTD In the wake of pandemic Corona menace had completed 388 days and the Akhanda parayanams of Sundarakanda alone has crossed 326 days.
Under his supervision the 171 shlokas of the 13th edition were today rendered by the Vedic pundits- Sri Maruti and Sri Narasimha Charyulu and the program was live telecast by SVBC between 07.00-09.00 am for benefit of devotees.
Additional EO Sri AV Dharma Reddy, faculty members of Dharmagiri Pathashala and other officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తిభావాన్ని పంచిన సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల, 2021 మే 02: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు సుందరకాండలోని 54వ సర్గ నుంచి 57వ సర్గ వరకు ఉన్న 171 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. ఈ రోజు సుందరకాండలో అత్యంత కీలకమైన లంకా దహనం – రాక్షస సంహరం సర్గలను పారాయణం చేసినట్లు తెలిపారు. దీని వలన ప్రజలందరికి ఆరోగ్యం, సంపద వంటి మహా ఫలితాలు లభిస్తాయన్నారు. లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 388 రోజులు పూర్తి చేయగా, మే 2వ తేదీకి సుందరకాండ పారాయణం 326 రోజులు పూర్తి అయిందని వివరించారు.
13వ విడత అఖండ పారాయణంలోని 171 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ మారుతి, శ్రీ నరసింహచార్యులు పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి దంపతులు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.