SUNDARAKANDA PATHANAM IS FIRST OF ITS KIND IN TIRUMALA HISTORY – ADDITIONAL EO _ తిరుమలలో సుందరకాండ పారాయణం చారిత్రాత్మకం

CONCLUDES ON A CEREMONIOUS NOTE 

16TH PHASE OF AKHANDA PATHANAM HELD WITH RELIGIOUS FERVOUR

RECEIVES OVERWHELMING RESPONSE FROM DEVOTEES

TIRUMALA, 24 JULY 2021: Sundarakanda Pathanam is the first of its kind spiritual programme in the History of Tirumala said TTD Additional EO Sri AV Dharma Reddy. 

One of the most prestigious of the Parayanam programmes mulled by TTD with an aim to get rid of the ill effects of the Covid from across the world, Sundarakanda Pathanam concluded on a ceremonious note with the recitation of slokas during last Phase of Akhanda Pathanam at Nadaneerajanam Mandapam in Tirumala on Saturday held under the supervision of Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, with the slokas being recited by scholars Sri Seshacharyulu, Sri Pavanakumara Sharma and Dr Maruti.

Speaking on the occasion, the Additional EO said, seeking divine intervention to overcome Covid Pandemic, TTD has commenced the Parayanam programmes during April last with Yoga Vasisthyam – Visuchika Maha Mantra Parayanam and later began Sundarakanda Pathanam from June 11 onwards in 2020. 

“Sundarakanda Pathanam might have been recited by many scholars at different places but the one taken up by TTD is unique from others. With an aim to take the essence of the shlokas from this famous episode of Ramayana to the people, we not only did sloka Parayanam but also explained its meaning co-relating to the present-day affairs for the easy understanding of pilgrim devotees. With the live telecast of the Parayanam on SVBC, millions and millions of devotees from across the world watched the programme and even chanted the shlokas every day with utmost dedication and devotion. The divine chantings of Sri Rama and Sri Hanuman Namas which we did all these days will definitely protect all of us from the dreadful Covid virus”, he asserted.

BALAKANDA AND SAKALAKARYASIDDHI SRIMADARAMAYANA PARAYANAM FROM JULY 25

The Additional EO said, the Parayana Yagnam will continue and yet another important episode from epic Ramayanam, Balakanda will commence at Nada Neerajanam from July 25 onwards. “Everyday there will be recitation of slokas from Balakanda along with narration akin to Sundarakanda by scholars between 7am and 8am and will be telecasted live on SVBC for the sake of global devotees”, he added.

Similarly, to overcome the economical crisis and bring back the shattered life across the globe caused due to Corona pandemic to normalcy, TTD has planned a month-long Sakalakaryasiddhi Srimadramayana Parayanam which also commences at Vasanta Mandapam in Tirumala from Sunday onwards. All the important slokas from Sundarakanda, Balakanda, Ayodhyakanda, Kiskindakanda, Yuddhakanda etc. Will be recited from July 25 till August 23″, he added.

In his remarks, Sri KSS Avadhani, the Principal, Dharmagiri Veda Vignana Peetham at Tirumala said, the Parayanam Maha Yaganam which won the hearts of millions of devotees across the globe has completed 471 days while Sundarakanda was concluded on the auspicious day of Guru Poornima after 409 days of non-stop recitation covering all chapters. “On the last day, that is today, a total of 229 shlokas including 109 from 65 to 68 Sargas of Sundarakanda and remaining from Yuddhakanda were recited today and concluded with slokas describing Sri Rama Pattabhishekam episode. Following the Beejaksharams, the Akhanda Sundarakanda Pathanam was carried out 16 times covering all the 68 Sargas and 2821 shlokas from the epic Srimad Ramayanam penned by Sri Valmiki Maharshi”, he added. 

Later the Additional EO felicitated Sri KSS Avadhani, Dr A Vibhishana Sharma and others for their contributions in making the Sundarakanda Pathanam a huge success with their scholarly recitation and narration all these days. He also felicitated CEO SVBC Sri Suresh Kumar on the occasion.

Earlier the programme commenced with the artistes from Annamacharya Project presenting a melodious sankeertan penned by Saint Poet Sri Tallapaka Annamacharya, “Rama Ramachandra Raghava … Rajeeva Lochana Raghava…” and concluded with Hanuman Chalisa penned by Saint Tulasi Das. 

National Sanskrit University Vice Chancellor Prof Muralidhara Sharma, Annamacharya Project Director Sri Dakshinamurthy Sharma were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో సుందరకాండ పారాయణం చారిత్రాత్మకం

గురుపూర్ణిమ నాడు ఘనంగా ముగిసిన సుందరకాండ పారాయణ మహాయజ్ఞం

ఎస్వీబీసీ ద్వారా కోట్లాది మంది భ‌క్తుల పారాయ‌ణం

జులై 25 నుండి బాల‌కాండ ప్రారంభం

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021 జులై 24: కరోనా మహమ్మారిని దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరకాండ పారాయణం తిరుమలలో చారిత్రాత్మకమని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలియజేశారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై జరుగుతున్న సుందరకాండ పారాయణం శ‌నివారం గురుపూర్ణిమ నాడు ముగిసింది.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతోమంది సుందరకాండ పారాయణం చేపట్టి ఉండవచ్చని, అయితే తిరుమ‌ల చ‌రిత్రలో ప్ర‌ప్ర‌థ‌మంగా చేపట్టిన సుంద‌ర‌కాండ పారాయ‌ణం ఎంతో ప్రత్యేకమని, శ్లోకార్థంతో పాటు ప్రస్తుత సమాజానికి అన్వయించి సారాన్ని భక్తుల హృదయాల్లోకి తీసుకెళ్లగలిగామని చెప్పారు. క‌రోనా నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ ఏడాది క్రితం యోగవాశిస్టం- విషూచికా మంత్రంతో పారాయ‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభించామ‌ని, ఆ త‌రువాత సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేప‌ట్టామ‌ని చెప్పారు. బ్ర‌హ్మ వ‌రంతో శ్రీ వాల్మీకి మ‌హ‌ర్షి దివ్య‌దృష్టితో రామాయ‌ణాన్ని చూస్తూ అక్ష‌రీక‌రించార‌ని, ఇందులోని ప్ర‌తి శ్లోకం మంత్ర‌మేన‌న్నారు. సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గ‌ల 2,821 శ్లోకాలను 409 రోజులపాటు పారాయణం చేశామన్నారు. ప్ర‌తి శ్లోకానికి అర్థంతోపాటు ప్ర‌స్తుత స‌మాజానికి అన్వ‌యించి పండితులు వ్యాఖ్యానం అందించార‌ని వివ‌రించారు. శ్రీ బేడి ఆంజనేయ‌స్వామి, శ్రీ‌రాముని అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌మ‌క్షంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. రామ‌నామ‌స్మ‌ర‌ణ ఎక్క‌డ జ‌రిగితే అక్క‌డ హ‌నుమంతుడు ఉంటార‌ని వాల్మీకి మ‌హ‌ర్షి తెలియ‌జేశార‌ని, ఆవిధంగా ఇన్నిరోజులు ఆంజ‌నేయుడు మ‌న‌మ‌ధ్యే ఉన్నార‌ని చెప్పారు. ఆంజనేయుని ఆశీస్సులతో కరోనా త్వరగా దూరం కావాలని ఆకాంక్షించారు.

సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి స‌హ‌క‌రించిన శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, శ్రీ మారుతి, శ్రీ చ‌ల‌ప‌తి, శ్రీ శేషాచ‌లం, శ్రీ రామానుజం పండితులకు, ఈ కార్య‌క్ర‌మాన్ని కోట్లాది మంది భ‌క్తులకు చేరువ చేసిన‌ ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్ కు, అద్భుత‌మైన కీర్త‌న‌లు ఆల‌పించిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌కు అద‌న‌పు ఈవో ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. అనంత‌రం పండితుల‌ను, క‌ళాకారుల‌ను స‌న్మానించారు.

16వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం

తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 471 రోజులు పూర్తికాగా, సుందరకాండ పారాయ‌ణం 409 రోజులు పూర్తి చేసుకుని శ‌నివారంతో సంపూర్ణంగా ముగిసింద‌ని వివ‌రించారు. వాల్మీకి మహర్షి గురువుగా మారి రామాయణాన్ని లోకానికి అందించారని, గురుపూర్ణిమ నాడు సుందరకాండ పారాయణం ముగియడం శుభసూచికమని చెప్పారు.

65 నుండి 68వ సర్గ వరకు 4 సర్గలు, యుద్ధకాండ‌, శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేక ఘ‌ట్టం కలిపి మొత్తం 229 శ్లోకాలను శ్రీ అవధాని పర్యవేక్షణలో శ్రీ పివిఎన్ఎన్.మారుతి‌, శ్రీ ఎం. పవనకుమార శర్మ, శ్రీ శేషాచార్యులు పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.

జులై 25 నుండి బాల‌కాండ ప్రారంభం

తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై జులై 25వ తేదీ ఆదివారం నుండి బాల‌కాండ పారాయ‌ణం ప్రారంభం కానుంది. ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తుంది. బాల‌కాండ‌లో మొత్తం 2,228 శ్లోకాలున్నాయి. ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం శాస్త్ర పండితులు డా. రామానుజం శ్లోక పారాయ‌ణం చేస్తారు. ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు డా. ప్ర‌వ రామ‌కృష్ణ వ్యాఖ్యానం అందిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల అధ్యాప‌కులు, పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.