”SUN”DAY SHINES ON SURYAPRAHA VAHANAM _ సూర్యప్రభ వాహనంపై శ్రీ యోగ నారాయణ అలంకారంలో సిరుల తల్లి
TIRUPATI, 23 NOVEMBER 2023: On the pleasant morning on Sunday, Sri Padmavati Devi as Yoga Narayana shined on the Suryaprabha Vahanam.
Led by caparisoned elephants, horses, bulls, bhajan troupes, the goddess of riches marched swiftly on the Sun carrier on the seventh day of the Navahnika Karthika Brahmotsavams at Tiruchanoor.
Both the Tirumala Pontiffs, EO Sri AK Singhal, JEO Sri Veerabrahmam, DyEO Sri Harindranath and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సూర్యప్రభ వాహనంపై శ్రీ యోగ నారాయణ అలంకారంలో సిరుల తల్లి
తిరుపతి, 2025 నవంబరు 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీ యోగ నారాయణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం,
ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, శ్రీనివాసాచార్యులు, పలువురు అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.













