SUPRABATHA SEVAS TO RESUME AT SRIVARI TEMPLE FROM JAN 15 ONWARDS _ జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 11 Jan. 21: As the holy Dhanurmasa concludes on January 14, the sacred daily Suprabatha Seva will resume at Srivari Temple from January 15 onwards.

It may be mentioned here that Sri Goda Tiruppavai Pasura Parayanam replaced Suprabhata Seva in Tirumala temple from December 17 onwards with the advent of Dhanurmasam on December 16 after 6am.

On January 15, the TTD is also organising the Goda Parinayotsavam at Srivari temple in the morning and later in the evening Paruveta Utsavam at Parveta Mandapam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2021 జనవరి 11: పవిత్రమైన ధనుర్మాసం జ‌న‌వ‌రి 14వ తేదీ గురువారం ముగియనుండడంతో శుక్ర‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ శుక్ర‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.

అదేవిధంగా జనవరి 15వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.