SUPREME COURT JUDGE OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్

TIRUMALA, 13 AUGUST 2023: The Honourable Judge of Supreme Court Justice Bhushan Ramakrishna Gavai offered prayers in Tirumala temple along with his family on Sunday.

He was welcomed by TTD Chairman Sri Karunakara Reddy and the EO Sri AV Dharma Reddy.

After offering prayers, he was rendered Vedasirvachanam inside Ranganayakula Mandapam.

Later the Chairman presented Theertha Prasadams, a laminated photo of Srivaru, Namami Govindam kit, Agarbattis kit, Dry Flower Technology photo of deity to the protocol dignitary.  

The CJ of AP High Court Justice Dhiraj Singh Thakur also had darshan of Sri Venkateswara.

Later the Supreme Court Judge and AP High Court CJ both offered prayers in Sri Bedi Anjaneya Swamy temple.

AT TIRUCHANOOR

Both the Justices of the apex courts had darshan of Sri Padmavathi Ammavaru in Tiruchanoor later on Sunday separately.

They were received by TTD EO Sri AV Dharma Reddy and darshan arrangements were made to the protocol dignitaries.

After rendering Ashirvachanam,  they were offered prasadams of Ammavaru at Asirvada Mandapam.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్

తిరుమల, 13 ఆగస్టు 2023: తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఆయనకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.

తరువాత చైర్మన్‌ ఆయనకు తీర్థప్రసాదాలు, శ్రీవారి ఫొటో, నమామి గోవిందం కిట్‌, అగర్‌బత్తీలు, డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫొటోను అందజేశారు.

ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు సీజే ఇద్దరూ కలిసి శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు చేశారు.

తిరుచానూరు :

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

వీరికి టీటీడీ ఈవోశ్రీ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎపి హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అమ్మవారి దర్శనం తరువాత టీటీడీ ఈఓ, ఆలయ అధికారులు ఆశీర్వాద మండపంలో వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.