SURPRISE INSPECTION BY TTD CHAIRMAN AT PALAMANER GOSALA _ పలమనేరులోని టిటిడి గోశాలలో టిటిడి ఛైర్మెన్ ఆకస్మిక పరిశీలన
Tirupati, 21 May 2025: TTD Chairman Sri B.R. Naidu conducted a surprise inspection at the TTD Gosala located in Palamaner on Wednesday.
Spread across 450 acres, the TTD-run Swadeshi Go Samvardhana Trust currently houses around 500 cows.
Expressing displeasure over improper maintenance and unhygienic surroundings, the Chairman instructed officials to submit a detailed report on the daily operations of the Gosala within a week.
Later, the Chairman personally offered fodder to the cows and inquired with the staff about the availability and quality of feed, drinking water, and veterinary care being provided to the cattle.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పలమనేరులోని టిటిడి గోశాలలో టిటిడి ఛైర్మెన్ ఆకస్మిక పరిశీలన
తిరుపతి 2025, మే 21: పలమనేరులోని టిటిడి గోశాలలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు బుధవారం ఆకస్మిక పరిశీలన చేపట్టారు. పలమనేరులో 450 ఎకరాలలో టిటిడి స్వదేశీ గో సంవర్థ సంస్థ 500 గోవులతో గోశాల నడుస్తోంది. గోవుల సంరక్షణ సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్రంగా పరిసరాలు ఉండడంపై టిటిడి ఛైర్మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల రోజువారి నిర్వహణపై వారం రోజులలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోశాలలోని గోవులకు టిటిడి ఛైర్మెన్ పశుగ్రాసం పెట్టారు. గోవులకు అందిస్తున్న దాణా, తాగునీరు, వైద్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.