SURPRISE INSPECTIONS BY EO AT CHAKRA THEERTHAM _ తిరుమలలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీలు
TIRUMALA, 23 MAY 2025: TTD EO Sri J Syamala Rao during his surprise inspection on Thursday, visited Sila Toranam (natural arch)and Chakra Theertham in Tirumala.
As a part of his inspection he verified the parking, cleanliness, shops, darshan system in these two areas.
The EO also observed the engraved images of Sri Sudarshana Chakrattalwar, Narasimha Swamy, Anjaneya Swamy and also the presence Sri Shiva located in the hillock atop Chakra Theertham.
He instructed the officers concerned to improve cleanliness and hygiene in the premises.
DyEO Health Sri Soman Narayana, Health Officer Dr Madhusudhan, TTD forest department staff, and others were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీలు
తిరుమల, 23 మే 2025: టిటిడి ఈఓ శ్రీ జె. శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆయన చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను మరియు అక్కడే ఉన్న శ్రీ శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈఓ శ్రీ సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూధన్, టిటిడి అటవీ శాఖ సిబ్బంది మరియు ఇతరులు కూడా హాజరయ్యారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జరీ చేయబడింది