SURYA PUJOTSAVAM BEGINS AT SRI VEDA NARAYANA SWAMY TEMPLE _ శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో వైభవంగా సూర్యపూజోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 24 MARCH 2023: The annual Surya Pujotsavam commenced on Friday at Sri Vedavalli Sametha Venadarayana Swamivari Temple in
Nagalapuram with grandeur.
As part of this festivities, Matsya Jayanti was observed in the temple. Every day there will be Teppotsavams till March 28 in the evening.
The speciality of the festivities is that on the first day the rays from the Sun fall on the feet, the next day on the abdomen and on the last day upon the fore head of the presiding deity which is located about 630feet away from outer prakaram which was an engineering wonder.
TEPPOTSAVAM
On the first day Friday evening, Sridevi Bhudevi along with Venadarayanaswamy will appear on the float in Pushkarini.
On March 25, Godadevi along with Venadarayanaswamy, on March 26 Sri Sita Lakshmana along with Sri Kodandaramaswamy, on March 27 Sridevi Bhudevi along with Srivedanarayanaswamy, on March 28 again Sridevi Bhudevi along with Venadarayanaswamy will glide on float and bless the devotees.
Temple Deputy EO Smt. Nagaratna and Superintendent Sri Ekambaram participated in this puja program.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో వైభవంగా సూర్యపూజోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023 మార్చి 24: నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం వార్షిక సూర్యపూజోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో సంవత్సరాల కొద్దీ యుద్ధం చేసి వచ్చినందున, స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపైన, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.
ఇందులో భాగంగా, శ్రీ వేద నారాయణ స్వామి వారికి శుక్రవారం మత్స్య జయంతి ఉత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 5 నుండి 5-30 గంటల వరకు సుప్రభాతం, 5:30 నుండి 6:30 గంటల వరకు తోమాల, అర్చన, ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శాంతి హోమం, నివేదన, పూర్ణాహుతి జరిపారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7:30 గంటల నుండి స్వామివారు తిరువీధి ఉత్సవంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. మార్చి 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం తెప్పోత్సవం జరుగనుంది. మార్చి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు దర్శనమిస్తారు.
మార్చి 25న గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారు, మార్చి 26న శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, మార్చి 27న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారు, మార్చి 28న శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ పూజ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరిండెంట్ శ్రీ ఏకాంబరం పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది