SV GO SAMRAKSHANSALA GEARS UP FOR BIG FEST _ గోకులాష్టమి వేడుకలకు ఎస్వీ గోసంరక్షణశాల ముస్తాబు
Tirumala, 26 August 2024: The SV Go Samrakshanasala has geared up to celebrate Gokulastami fest on August 27 with special Gopuja and cultural programs.
On the occasion of Gokulashtami, special programs will be organized at SV Go Samrakshanasala.
They include Venuganam, Veda Parayanam by students of Tirumala Vedic School, Bhajans and Kolatams by artists of TTD Dasa Sahitya Project.
Devotees will also be involved in performing Gopuja by offering fodder to the desi cows.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గోకులాష్టమి వేడుకలకు ఎస్వీ గోసంరక్షణశాల ముస్తాబు
తిరుపతి, 2024 ఆగస్టు 26: ఆగస్టు 27వ తేదీన నిర్వహించనున్న గోకులాష్టమి వేడుకలకు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 నుండి 10.30 గంటల వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేదపారాయణం, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.
గోశాలకు విచ్చేసే భక్తులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గోవును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం. కావున టిటిడి సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.