SV museum Facelift by the National Institute of Design in 3 months _ తితిదే మ్యూజియంలలో తిరుమల క్షేత్ర ప్రాశస్త్యం, సనాతన ధర్మం ప్రతిబింబించాలి : జెఈవో
Special galleries on Tirumala shrine
· Gallery on past celebrity devotees -kings, British and Mahants
Tirumala, June 5: The National Institute of Designs (NID), Ahmedabad will refurbish the Sri Venkateswara (SV) Museum at Tirumala to reflect the spiritual and devotional glory of Lord Venkateswara and the Hindu Sanatana Dharma.
TTD Joint Executive Officer K S Sreenivasa Raju who reviewed the face-lifting of the SV Museum with NID and other TTD officials at Annamayya Bhavan at Tirumala exhorted them to NID teams to focus on the rejuvenation of galleries on the legendry heights of sacred Tirumala shrine and its significance to the Sanatana Hindu Dharma. He also suggested to the NID teams who were studying the location to set up a special gallery in the Museum to enhance the spiritual and devotional levels of a huge mass of devotees that throng the temple shrine to be patient and dignifies in seeking blessings of the Lord Venkateswara.
Sri Raju also requested the NID team to design and put up a special gallery at the Museum glorifying the historical and mythological lores of Tirumala and the temple of Lord Venkateswara. There should be a separate gallery on the kings, queens, chieftains and also British and Mahant who contributed to the spread of Lord Venkateswara’s glory. The galleries should showcase the importance of Tirumala, its religious and devotional culture and its spiritual treasures to the future generations.
The TTD JEO also directed the TTD officials to set up an auditorium in the SV Museum to impart video and audio displays to devotees on the TTD’s commitment and efforts to explain the accommodation, festivals and programs arranged at Tirumala for their benefit. Separate galleries also are to beset up to display the rich collection of coins and inscriptions available at Tirumala.
Sri Raju said all the departments of TTD would provide all support to the NID officials to complete their studies and provide enthralling designs for new galleries within three months so that the same could be placed before the TTD board by the EO for necessary action.
Prominent among those who attended the review meeting were NID project head Sri Anil Sinha, Dr B R Ramani of the Archeological Survey of India, Delhi, Sri Ramesh Reddy, SE-2 of TTD, Additional CVSO –Sri Shivkumar Reddy and Chief Museum Officer Sri Vijay Kumar, Sri Muniratnam Reddy, Archaeological Survey of India, Mysore, Sri Ravishankar Reddy, DE (Electricals)and others participated in the review meeting.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తితిదే మ్యూజియంలలో తిరుమల క్షేత్ర ప్రాశస్త్యం, సనాతన ధర్మం ప్రతిబింబించాలి: జెఈవో
తిరుమల, జూన్ 05, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలో ఉన్న మ్యూజియంలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం, భారతీయ హిందూ సనాతన ధర్మం ప్రతిబింబించాలని తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు ఆకాంక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం ఆయన అహ్మదాబాదుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్(ఎన్‌ఐడి) నిపుణులు, తితిదే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ మ్యూజియంలను యాత్రిక భక్తులకు కొత్త కోణంలో చూపే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఐడి నిపుణుల బృందం నాలుగు రోజులుగా అధ్యయనం చేస్తోందని, మ్యూజియంలలో ప్రధానంగా తిరుమల పవిత్రత, క్షేత్రమహత్యం, హిందూ ధర్మ ప్రాశస్త్యంపై గ్యాలరీలు ఉండాలని కోరారు. భారతీయ సనాతన ధర్మంలో సహనానికి అధిక ప్రాధాన్యత ఉందని, తిరుమలకు వచ్చే భక్తులు ఏవిధంగా సహనంతో వ్యవహరించాలి, స్వామి మహత్యాన్ని ఏవిధంగా తెలుసుకోవాలి, క్షేత్ర మహిమ, స్వామివారి పౌరాణిక నేపథ్యం తదితర అంశాలతో పూర్తిగా ఆలయానికి సంబంధించి ఒక గ్యాలరీ ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఎన్‌ఐడి నిపుణులకు సూచించారు. శ్రీవారి ఆలయాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడిన అలనాటి రాజులు, రాణులు, ఇతర ప్రముఖుల వివరాలతో విడిగా గ్యాలరీ రూపొందించాలని కోరారు. బ్రిటీషువారు, మహంతుల పరిపాలనలో తిరుమలలో జరిగిన అభివృద్ధిపై మరొక గ్యాలరీ ఉండాలన్నారు. చిన్నపిల్లలు, నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేలా వివిధ రకాల చిత్రలేఖనాలు ఏర్పాటు చేయాలని కోరారు.
తిరుమల మ్యూజియంలో ప్రత్యేకంగా స్వామివారి విశేషాలు, భక్తులకు తితిదే అందిస్తున్న వసతులు, కార్యక్రమాలు, ఉత్సవాలను సమగ్రంగా డాక్యుమెంటరీ రూపంలో భక్తులకు ప్రదర్శించేందుకు వీలుగా ఆడిటోరియంను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తిరుమల క్షేత్ర మహిమ, హైందవం, మన సంస్కృతి సంప్రదాయాలు నేటి తరానికి సులువుగా అర్థమయ్యేరీతిలో గ్యాలరీలు ఏర్పాటుచేయాలని కోరారు. శాసనాలు, నాణేలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం ద్వారా మ్యూజియానికి నిండుదనం వస్తుందన్నారు. గ్యాలరీల ఏర్పాటుకు సంబంధించి అటు ఎన్‌ఐడి నిపుణులు, ఇటు తితిదే అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్‌ఐడి నిపుణులు మూడు నెలల్లోపు డిజైన్లు తితిదేకి అందించగలిగితే ఈ విషయాన్ని తితిదే ఈవో, పాలకమండలి దృష్టికి తీసుకెళ్లి మ్యూజియం అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు వెంటనే ముఖ్య మ్యూజియం అధికారికి అవసరమైన సమాచారం అందజేయాలని, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలని జెఈవో సూచించారు.
తిరుమల మ్యూజియంలో ప్రత్యేకంగా స్వామివారి విశేషాలు, భక్తులకు తితిదే అందిస్తున్న వసతులు, కార్యక్రమాలు, ఉత్సవాలను సమగ్రంగా డాక్యుమెంటరీ రూపంలో భక్తులకు ప్రదర్శించేందుకు వీలుగా ఆడిటోరియంను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తిరుమల క్షేత్ర మహిమ, హైందవం, మన సంస్కృతి సంప్రదాయాలు నేటి తరానికి సులువుగా అర్థమయ్యేరీతిలో గ్యాలరీలు ఏర్పాటుచేయాలని కోరారు. శాసనాలు, నాణేలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం ద్వారా మ్యూజియానికి నిండుదనం వస్తుందన్నారు. గ్యాలరీల ఏర్పాటుకు సంబంధించి అటు ఎన్‌ఐడి నిపుణులు, ఇటు తితిదే అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్‌ఐడి నిపుణులు మూడు నెలల్లోపు డిజైన్లు తితిదేకి అందించగలిగితే ఈ విషయాన్ని తితిదే ఈవో, పాలకమండలి దృష్టికి తీసుకెళ్లి మ్యూజియం అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు వెంటనే ముఖ్య మ్యూజియం అధికారికి అవసరమైన సమాచారం అందజేయాలని, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలని జెఈవో సూచించారు.
ఈ సమీక్షలో ఎన్‌ఐడి ప్రాజెక్టు హెడ్ శ్రీ అనిల్ సిన్హా, న్యూఢిల్లీలోని ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ బి.ఆర్.మణి, తితిదే ఎస్‌ఈ-2 శ్రీ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్‌ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ముఖ్య మ్యూజియం అధికారి శ్రీ విజయ్‌కుమార్, మైసూరులోని నేషనల్ ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శ్రీ మునిరత్నంరెడ్డి, డిఇ(ఎలక్ట్రికల్) శ్రీ రవిశంకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.