SVBC CHANNEL TO GIVE WIDE PUBLICITY ON ANNAMACHARYA SANKEERTANS _ ఎస్వీబీసీలో అన్న‌మయ్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం

COMPETITIONS ON ANNAMAIAH KRITIS IN TELUGU STATES

 TIRUPATI, 06 AUGUST 2021: The Sankeertans of Saint Poet Sri Tallapaka Annamacharya should be given wide publicity in SVBC and competitions to be held for youth in both Telugu states said TTD EO Dr KS Jawahar Reddy.

A meeting was held in Sri Padmavathi Rest House at Tirupati on Friday evening on how to popularize Annamaiah Sankeertans through SVBC.

Speaking on the occasion, the EO said competitions in Annamacharya Sankeertans shall be conducted to the youth of two Telugu states and popularise them in a wide spread manner. He said competitions shall be conducted district wise after carrying out a screening test.

These competitions will be held in Hyderabad and Tirupati SVBC studios and final competitions will be held in Tirupati. The competitions will be among the 4000 Annamaiah Sankeertans was brought to light by TTD in recent years. The search of young talent is to bring to fore the remaining Sankeertans of Annamacharya”, he maintained.

Similarly to make youth and next-gen aware of Vedic sciences, maths, astrology, etc. a the unique program “Vedam Jeevanadam” will be telecasted weekly twice on SVBC during prime slots.

With a mission to make Tirumala, a plastic-free zone, jingles are prepared by SVBC which will be promoted for the information of the global pilgrims at regular intervals.

SVBC CEO Sri Saikrishna Yachendra, MD Sri AV Dharma Reddy, CEO Sri Suresh Kumar, SVVU VC Sri S Sudarshana Sharma were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీలో అన్న‌మయ్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం

సామాన్యుల ద‌రి చేరేలా వేదం – జీవ‌న‌నాదం కార్య‌క్ర‌మం

టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 06: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా అన్న‌మాచార్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. అలాగే, సామాన్యుల‌కు సైతం అర్థ‌మ‌య్యేరీతిలో వారానికి రెండు రోజులు వేదం-జీవ‌న‌నాదం కార్య‌క్ర‌మం ప్రైమ్‌టైమ్‌లో ప్ర‌సారం చేయాల‌ని ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శుక్ర‌వారం సాయంత్రం ఎస్వీబీసీ కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించాల‌న్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లపై పోటీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. తొలుత జిల్లాస్థాయిలో, ఆ త‌రువాత రాష్ట్ర‌స్థాయిలో యువ‌త‌కు పోటీలు నిర్వ‌హించాల‌న్నారు. హైద‌రాబాద్‌, తిరుప‌తిలోని ఎస్వీబీసీ స్టూడియోల్లో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని కోరారు. టిటిడి రికార్డు చేసిన 4 వేల సంకీర్త‌న‌ల నుంచే ఈ పోటీలు నిర్వ‌హించ‌డం ద్వారా యువ‌త‌ను ఆక‌ర్షితుల‌ను చేయ‌వ‌చ్చ‌న్నారు. వేదాలు సామాన్య మాన‌వుని జీవ‌న విధానానికి అవ‌స‌ర‌మైన గ‌ణితం, ప‌శుపోష‌ణ‌, వ్య‌వ‌సాయం లాంటి అనేక వైజ్ఞానిక అంశాల‌ను తెలియ‌జేశాయ‌న్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వేదం – జీవ‌న‌నాదం కార్య‌క్ర‌మం వారానికి రెండు రోజులు రాత్రిపూట ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం చేసేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌న్నారు.

తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధంపై భ‌క్తుల‌కు పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూపొందించిన జింగిల్స్‌ను ఎస్వీబీసీలో విస్తృత ప్ర‌చారం చేయాల‌న్నారు.

ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర‌, టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, ఎస్వీబీసీ సిఈవో సురేష్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.