SVBC GETS ISO CERTIFICATION _ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్లు
TIRUMALA, 16 FEBRUARY 2022: The SVBC channel of TTD has received prestigious ISO (International Standards Organization) certification on Wednesday.
The representatives of the Organization have handed over the certificate to TTD Chairman Sri YV Subba Reddy, EO Dr. KS Jawahar Reddy, and Additional EO Sri AV Dharma Reddy at Anjanadri in Tirumala.
The Chairman complimented the efforts of SVBC in spreading Bhakti among devotees across the globe through various spiritual programs during the Corona Pandemic period.
ISO representative Sri Sivaiah, CEO SVBC Sri Suresh Kumar were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్లు
టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో సమక్షంలో సర్టిఫికెట్లు అందించిన ఐఎస్‌వో ప్రతినిధులు
తిరుమల, 2022 ఫిబ్రవరి 16: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ధ్రువీకరణ లభించింది. ఈ మేరకు ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల అంజనాద్రి వద్ద టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి సమక్షంలో ధ్రువపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఎస్వీబిసి కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సనాతన హైందవ ధర్మ ప్రచారానికి విశేష కృషి చేస్తున్నదన్నారు. కోవిడ్ – 19 నేపథ్యంలో ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల ఇళ్లకు చేర్చడంతో పాటు అనేక కొత్త కార్యక్రమాలకు ఎస్వీబీసీ శ్రీకారం చుట్టిందన్నారు.
కాగా ఎస్వీబిసిలో ఆధ్యాత్మిక డాక్యుమెంటరీల నిర్వహణ, ఉత్తమ మౌళిక సదుపాయాలు, ఉత్తమ ప్రమాణాలతో కార్యక్రమాల ప్రసారానికి సంబంధించి ఐఎస్ఓ-9001 సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి సిఇవో శ్రీ సురేష్‌కుమార్, ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు శ్రీ శివయ్య, ఇతర అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.