‘SWACHH ANDHRA’ MASS CLEANING DRIVE IN TIRUMALA ON APRIL 19 _ 19న తిరుమలలో ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

TIRUMALA, 18 APRIL 2025: As part of the prestigious ”Swachh Andhra” initiative launched by the State Government, the TTD will organize a mass cleaning drive program in Tirumala on Saturday.

The TTD Additional EO Sri Ch.Venkayya Chowdary will inaugurate the program along the First Ghat Road of Tirumala.

The drive will take place from 6 AM to 12 Noon, during which a large number of TTD officials, staff actively participate in clearing garbage and cleaning the roads.

The event will commence at the Kumkala Point (last step) along the Alipiri footpath route.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

19న తిరుమలలో ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

తిరుమల, 2025 ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారమైన ఏప్రిల్ 19న తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించనుంది.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేయనున్నారు.

అలిపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.