SWARNA RATHOTSAVAM HELD _ స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం

TIRUMALA, 22 OCTOBER 2023: The procession of Golden Chariot was held with utmost religious fervour on the penultimate day of the ongoing Navaratri Brahmotsavam in Tirumala on Sunday.

Sri Malayappa Swamy in all His resplendence flanked by Sridevi and Bhudevi on either sides appeared atop the Swarna Ratham blessing devotees all along the four mada streets.

His Holiness Tirumala Sri Pedda Jeeyangar Swamy along with his deputy Sri Chinna Jeeyangar Swamy, TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం

తిరుమల, 2023 అక్టోబరు 22: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉద‌యం 7.15 గంటలకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌ బంగారుతేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించాడు. మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ర‌థ‌న్ని లాగారు.

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.

స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.