TAKE EFFECTIVE STEPS FOR SNACKS AND ANNA PRASADAM DISTRIBUTION TO DEVOTEES- TTD EO _ భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకోండి – అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

Tirupati, 25 Feb. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy directed officials to take all steps for the provision of snacks and Anna Prasadam to devotees in the PAC-1&2 and VQC-2 in view of gradually increasing number of devotees to Tirumala for Srivari Darshan after Covid guidelines relaxation.

Speaking at a review meeting with Anna Prasadam wing officials at his chambers in TTD administrative building on Thursday morning, the TTD EO asked officials to stock adequate materials at kitchens in VQC and MTVAP Bhavan to prepare snacks and Anna Prasadam for the ever-increasing devotee population at Tirumala.

The officials made a PP presentation on the phases of Anna Prasadam to devotees since the inception of the AP division in TTD.

They also informed the TTD EO about the food packets distribution etc. made during the Covid lockdown period for affected lakhs of daily wagers and devotees at Tirupati.

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Annadanam DyEO Sri Nagraj, Catering Officer Sri G LN Shastri were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకోండి
– అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుమల, 25 ఫిబ్రవరి 2021: కోవిడ్ అనంతరం తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నందు వల్ల పిఎసి 1 , పిఎసి 2,రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అల్పాహారం, అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనం లోని తన చాంబర్లో గురువారం ఆయన అన్న ప్రసాదం విభాగం పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ , భక్తుల సంఖ్య పెరుగుతున్నందువల్ల వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వంటశాలల్లో ఆధునిక వంటసామగ్రి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు.
అన్న ప్రసాదం విభాగం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దశల వారీగా అన్న ప్రసాదం అందిస్తున్న భక్తుల సంఖ్య, సేవలు ఎలా పెరుగుతూ వచ్చాయనే విషయంపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోవిడ్ సమయంలో బాధితులకు, లాక్డౌన్ సమయంలో పేదలు, కూలీల కు లక్షలాదిమందికి అన్న ప్రసాదం పంపిణీ చేసిన వివరాలను తెలియజేశారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అన్నదానం డిప్యూటి ఈవో శ్రీ నాగరాజు, కేటరింగ్ ఆఫీసర్ శ్రీ జిఎల్ ఎన్ శాస్త్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది