TELANGANA GOVERNOR OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tirumala, 24 Jan. 21: The Honourable Governor of Telangana State, Smt Tamilisai Soundarajan on Sunday along with her family members had darshan of Lord Venkateswara at Tirumala.

After darshan, she was presented with Srivari Thirtha Prasadams, diary, and calendar at Ranganayakula Mandapam by TTD Additional EO Sri AV Dharma Reddy after Veda ashirvachanam by Veda pundits.

Srivari temple DyEO Sri Harindranath Reception DyEO Sri Balaji, Peishkar Sri Jaganmohanacharyulu and other officials were present 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

జనవరి 24, తిరుమల 2021: తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు.
 
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గౌ|| గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండ‌ర్‌ అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.