TASTY ANNAPRASADAM AT SKVST BRAHMOTSAVAM _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు

– NEARLY 3,000 DEVOTEES SERVED DAILY WITH DONORS SUPPORT

– NINE VARIETIES OF DISHES SERVED FOR LUNCH

– DEVOTEES EXPRESS HAPPINESS OVER ANNAPRASADAMS

Tirupati, 13 February 2026: During the ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram, TTD is serving tasty and uninterrupted Annaprasadams every day to thousands of devotees visiting the temple, with the generous support of donors. 

Devotees have expressed their immense happiness and gratitude over the delicious arrangements of Annaprasadam.

TTD has been distributing free Annaprasadams as a sacred and continuous service to devotees visiting Tirumala for Srivari darshan. 

Similarly, special measures have been taken to provide Annaprasadams at all TTD affiliated temples with the support of donors.

As per the directions of TTD Chairman Sri B.R. Naidu and EO Sri M. Ravichandra, the arrangements are being supervised by JEO Sri Veerabrahmam and Temple Special Officer Dr. T. Ravi. Under the guidance of Special Grade Deputy EO Smt. Varalakshmi and AEO Sri Gopinath, the Annaprasadam service is being efficiently managed.

Every morning, about 700 devotees are served breakfast items such as Pongal, Semiya Upma, Tomato Rice, Khichdi, Veg Rice, Chutney and Kesari.

For lunch, nine varieties including rice, leafy dal, chutney, sambar, rasam, curd, appalams, sweet and banana are served as Maha Prasadam. 

At night, around 700 devotees are provided Dondakaya Rice, Khichdi, Tomato Rice and Veg Rice.

In addition, under the TTD Annaprasadam Wing, Pongal, Upma, Vada, Chutney and Sambar are served in the morning, while Sambar Rice and Curd Rice are distributed continuously during the afternoon and night.

The Annaprasadam service, maintained with cleanliness, quality and punctuality, has received appreciation from devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు

దాతల సహకారంతో రోజుకు సుమారు 3 వేల మందికి భోజన వితరణ

మధ్యాహ్నం తొమ్మిది రకాల వంటకాలతో మహా ప్రసాదం

అన్నప్రసాదాలపై భక్తుల హర్షం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిమంది భక్తులు విచ్చేస్తుండగా, వారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తోంది. భక్తులు ఈ సేవపై ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ అనాదిగా ఉచిత అన్నప్రసాద వితరణను యజ్ఞంగా నిర్వహిస్తోంది. ఇదే విధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేకాధికారి డా.టి. రవి పర్యవేక్షణలో, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్ ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద సేవ సమర్థవంతంగా కొనసాగుతోంది.

ప్రతిరోజూ ఉదయం సుమారు 700 మంది భక్తులకు పొంగలి, సేమియా ఉప్మా, టమాటా రైస్, కిచిడి, వెజ్ రైస్, చట్నీ, కేసరి వంటి పదార్థాలు అందిస్తున్నారు. మధ్యాహ్నం అన్నం, ఆకుకూర పప్పు, చట్నీ, సాంబారు, రసం, పెరుగు, అప్పడాలు, స్వీటు, అరటిపండు తదితర తొమ్మిది రకాల వంటకాలతో మహా ప్రసాదం వడ్డిస్తున్నారు. రాత్రి సుమారు 700 మందికి దొండకాయ రైస్, కిచిడి, టమాటా రైస్, వెజ్ రైస్ అందిస్తున్నారు.

అదనంగా, టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం పొంగలి, ఉప్మా, వడ, చట్నీ, సాంబారు; మధ్యాహ్నం, రాత్రి సాంబారు అన్నం, పెరుగు అన్నం నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు.

శుభ్రత, రుచితనం, సమయపాలనతో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద సేవ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది