TEMPLE DOORS CLOSED _ పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ తలుపులు మూత
TIRUMALA, 28 OCTOBER 2023: Following partial lunar eclipse on October 29 between 1:05am and 2:22am, Tirumala temple doors were closed on Saturday at 7:05pm.
After performing Suddhi rituals, the doors will be reopened on Sunday at 3:15am.
The Annaprasadam activities were also stalled by 6pm and will resume at 9am onwards on October 29.
TTD EO Sri AV Dharma Reddy, DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ తలుపులు మూత
తిరుమల, 2023 అక్టోబరు 28: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.
ఆదివారం తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. గ్రహణం అనంతరం శుద్ధి చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
అదేవిధంగా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తెరుస్తారు.
టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.