TEMPLE-WISE FESTIVALS IN MAY AT TIRUCHANOOR & SUB TEMPLES _ మే నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor:

Friday Tiruchi Utsavams (May 1, 15, 22, 29 at 6 PM); Swarna Ratham (May 1, 9:30 AM); Vasanthotsavams conclude on May 2; Gaja Vahanam (May 8, 6:45 PM).

Sri Sundararaja Swamy Temple:

Tiruchi Utsavam on May 13 at 7 PM.

Sri Balarama Krishna Swamy Temple:

Tiruchi Utsavam on May 18 at 7 PM.

Sri Suryanarayana Swamy Temple:

Tiruchi Utsavam on May 27 at 5 PM.

Sri Srinivasa Swamy Temple:

Abhisekams on May 2, 9, 16, 23, 30 at 8 AM.

Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple:

Friday sevas (May 1, 8, 15, 22, 29 at 7 AM); Ashtadala Padapadmaradhana (May 5, 8 AM); Kalyanotsavam (May 9, 10:30 AM); Ashtottara Kalasabhishekam (May 13, 8 AM); Sri Prasanna Anjaneya Swamy Abhisekams (May 3, 10, 17, 24, 31 at 8:15 AM).

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

–   మే 1, 15, 22, 29వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం

–     మే 1న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం.

–     మే 2వ తేదీ అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు ముగుస్తాయి.

–     మే 8న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..

–    మే 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.

 

శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో..

–      మే 18వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..

–   మే 27న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..

•  మే  2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం.

అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…..

–  మే 1, 8, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

–   మే 5న ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.

–   మే 9న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.

–   మే 13న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

–  మే 3, 10, 17, 24, 31వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.