TEPPA FEST CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
Tirumala, 28 Mar. 21: Under the bright full moonshine, Sri Malayappa flanked by Sridevi and Bhudevi took a celestial ride on Float.
On the fifth and final day of Teppotsavam on Sunday evening, the deities glided on the sacred waters of Swamy Pushkarini in seven rounds and blessed the devotees.
The annual Teppotsavam concluded on the auspicious Phalguna Pournami day.
Additional EO Sri AV Dharma Reddy, CE Sri Ramesh Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమల, 2021 మార్చి 28: తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ అనంత, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.