TEPPOTSAVAM HELD _ తెప్పలపై శ్రీ సుబ్రమణ్య స్వామివారి అభయం

Tirupati, 30 December 2025: On the second day evening, Sri Subramanya Swamy took out a celestial ride on a finely decked float as part of ongoing annual Teppotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati.

DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తెప్పలపై శ్రీ సుబ్రమణ్య స్వామివారి అభయం

 తిరుపతి, 2025 డిసెంబరు 30: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగ‌ళ‌వారం శ్రీ సుబ్రమణ్య స్వామివారు అభయమిచ్చారు.

 సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ సుబ్రమణ్యస్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.