TEPPOTSAVAMS AT TIRUCHANOOR _ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
TIRUPATI, 20 JUNE 2024: The annual Teppotsavam was observed with utmost devotion on the penultimate day on Thursday evening.
The Goddess Padmavati in all Her religious splendour took out a celestial ride along the Padma Pushkarini on the tastefully decorated and dazzling float to bless Her devout.
DyEO Sri Govindarajan, Superintendent Sro Madhu and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
• గజ వాహనంపై కటాక్షించిన సిరిలతల్లి
తిరుపతి, 2024 జూన్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో గురువారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
తెప్పోత్సవాల్లో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సూపరింటెండెంట్ శ్రీ మధు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.