TEPPOTSAVAMS COMMENCE IN SRI GT IN EKANTAM _ శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
Tirupati, 10 Feb. 22: The annual Teppotsavams in Sri Govinda Raja Swamy temple commenced in Ekantam on Thursday.
Usually every year the Utsava deities of Sri Sita Lakshmana Sameta Sri Rama from Sri Kodanda Rama Swamy temple were taken to Sri Govinda Raja Swamy temple Pushkarini and Teppotsavams were being observed on first day.
As this year, it was being observed in Ekantam, snapana tirumanjanam was performed to Utsava deities in Sri Kodanda Rama Swamy temple itself.
Spl Gr DyEO Smt Parvati, AEO Sri Durgaraju and others were present.
On second day onwards Teppotsavams will be observed in Ekantam in Sri GT only.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి వేడుకగా స్నపనతిరుమంజనం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 16వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు.
మొదటిరోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరించడం ఆనవాయితీ. తెప్పోత్సవాలు ఏకాంతం కావడంతో తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు.
శుక్రవారం నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో రోజు శ్రీ పార్థసారథిస్వామి వారు, మూడో రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, నాలుగో రోజు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, చివరి మూడు రోజులు శ్రీ గోవిందరాజ స్వామి వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపపరింటెండెంట్ శ్రీ రమేష్ కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ జయకుమార్, శ్రీ మునిరత్నం పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.