TEPPOTSAVAMS COMMENCES _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 17 JUNE 2024: Annual Teppotsavams commenced on a grand religious note in Tiruchanoor on Monday evening.

The five-day event will conclude on June 21. On the first day Sri Padmavati Devi took out a celestial ride for three rounds on the finely decked float.

Superintendent Sri Seshagiri and others, devotees were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 17 జూన్ 2024: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి , టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.