TEPPOTSAVAMS COMMENCES _ శ్రీ వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 06 AUGUST 2025: The annual Teppotsavams commences in Sri Venugopala Swamy temple at Karvetinagaram on Wednesday evening.
As a part of it Snapana Tirumanjanam was held in the morning while the float festival was held in the evening.
On the first evening the Utsava deities blessed devotees in the guise of Ramavatara.
Temple staff, devotees were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2025 ఆగస్టు 06: కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తెనే, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మూడు రోజుల పాటు జరుగనున్న తెప్పోత్సవాలలో భాగంగా తెప్పపై స్వామి వారు విహరించనున్నారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
